2, నవంబర్ 2020, సోమవారం

ఉప పురాణాలు

ఉప పురాణాలు

అష్టాదశ పురాణాలలాగె మనకి అష్టాదశ ఉప పురాణాలు కూడా వున్నాయి. ఇవి కూడా వ్యాస మహా ముని విరచితములే. 

ఉప పురాణాల పట్టిక " సనత్కుమారము, నారసింహము, నారదీయము, శైవము, దౌర్వాసము, కాపిలము, మానవము, ఔసనసము, వారుణము, కాలికము, సాంబము, నందికృతము, ఆదిత్యము, మాహేశ్వరము, భాగవతము, వాసిష్ఠము, గణేషము మరియు హంస". 

24, ఆగస్టు 2009, సోమవారం

అష్టాదశ పురాణాలు

ఓం గం గణపతయే నమః 

పురాణాలు మన పూర్వీకులు మనకిచ్చిన తరగని నిధి మాత్రమే కాదు మంచి చెడులను వేరుచేయగలిగే విచక్షణా జ్ఞానానికి పునాది. ఇటువంటి పురాణాలకి నేడు ఆదరణ కరువై మూలన పడ్డాయి. వీటికి మళ్ళి మంచి రోజులు రావాలని ఆకాంక్షించే వారు తగు రీతిని వీటిని ప్రాచుర్యంలోకి తీసుకుని రావడానికి కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నం లో భాగంగానే ఈ బ్లాగ్ మొదలుపెట్టాము. ఈ ఆలోచన మాకు మంచి మిత్రులైన ఫణి కిశోరానిది. వారి సహాయ సౌజన్యాలతో మరుగున పడ్డ చాలా పురాణ కథలను అందరికి అందించగలనని ఆకాంక్షిస్తున్నాను. 

మన అష్టాదశ పురాణాలకి కర్త వ్యాస భగవానుడు. కాని వీటిని మన మనుజ లోకానికి పరిచయం చేసిన వారు మాత్రం నైమిశారణ్యంలో కలి భయం లేకుండా చేరి సూత మహా ముని దగ్గర తమ తమ పురాణ సందేహాలు తీర్చుకుంటున్న ఋషి పుంగవులు. భాగవతానికి మాత్రం ప్రముఖత వచ్చింది వ్యాస భగవానుని తనయుడు శుక మహా ముని వల్లన. అటువంటి అష్టాదశ పురాణాలను గురించి ముందుగా తెలుసుకుందాము. 

౧. మత్స్య పురాణం - పదునాలుగు వేల శ్లోకాలు 

౨. మార్కండేయ పురాణము - తొమ్మిది వేల శ్లోకాలు 

౩. భవిష్య పురాణము - పదునాలుగు వేల ఐదు వందల శ్లోకాలు 

౪. భాగవత పురాణము - పదునెనిమిది వేల శ్లోకాలు 

౫. బ్రహ్మ పురాణము - పదివేల శ్లోకాలు 

౬. బ్రహ్మాండ పురాణము - పన్నెండు వేల ఒక వంద శ్లోకాలు 

౭. బ్రహ్మ వైవర్త పురాణము - పదునెనిమిది వేల శ్లోకాలు 

౮. వామన పురాణము - పది వేల శ్లోకాలు 

౯. వాయు పురాణము - ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు 

౧౦. విష్ణు పురాణము - ఇరవై మూడు వేల శ్లోకాలు 

౧౧. వరాహ పురాణము - ఇరువది నాలుగు వేల శ్లోకాలు 

౧౨. అగ్ని పురాణము - పదహారు వేల శ్లోకాలు

 ౧౩. నారద పురాణము - ఇరవై ఐదు వేల శ్లోకాలు 

౧౪. పద్మ పురాణము - యాభై ఐదు వేల శ్లోకాలు 

౧౫. లింగ పురాణము - పదకొండు వేల శ్లోకాలు 

౧౬. గరుడ పురాణము - పంతొమ్మిది వేల శ్లోకాలు 

౧౭. కూర్మ పురాణము - పదిహేడు వేల శ్లోకాలు 

౧౮. స్కంద (కార్తిక) పురాణము - ఎనభై ఒక్క వేల శ్లోకాలు 

 వీటిని గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక సంక్షిప్త వాక్యము ప్రాచుర్యము లో వున్నది 

" 'మ' ద్వయం 'భ' ద్వయంచ 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం అ - నా - ప - లిం - గ - కూ - స్క ని.పురాణాని ప్రుదక్ ప్రుదక్ "|| 

వీటిలో భాగవత పురాణం చాలా పవిత్రమైనది. భాగవత పురాణము అంటే శ్రీమద్భాగావతమైనా కావచ్చు లేదా దేవి భాగవతం కావచ్చును. వీటి రెండిటి లో ఏది పురాణమనెడి చర్చ పక్కన పెట్టి ఒక భాగవతాన్ని వుపాసిస్తే మరొక భాగవతము కూడా సిద్దిస్తుందని ఆర్యోక్తి. కావున రెండు వేరు చేయదగినవి కాదు. ఈ పురాణాలలోని కథలతో మనము మునుముందు మరిన్ని బ్లాగులలో కలుసుకుందాము. 

 సెలవు 

భవదీయుడు 

ఆదిత్య